News October 27, 2025
ఖమ్మంలో పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు

ఖమ్మం జిల్లాలో 116 ఏ4 మద్యం షాపుల కేటాయింపును లాటరీ విధానంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొత్తం 4,430 దరఖాస్తులు అందగా, దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా తీశారు. రిజర్వేషన్ ప్రకారం గౌడలకు 18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 షాపులు కేటాయించారు. లాటరీ ప్రక్రియను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News October 28, 2025
ఖమ్మం: కార్తీకమాసం.. అరుణాచలంకు ప్రత్యేక బస్సు

కార్తీకమాసం సందర్భంగా ఖమ్మం కొత్తబస్టాండ్ నుంచి అరుణాచలంకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం సరీరాం తెలిపారు. నవంబర్ 3న రాత్రి 7గంటలకు బస్సు బయలుదేరి 4వ తేదీ కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అరుణాచలం చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5000, పిల్లలకు రూ.2530గా నిర్ణయించారు. వివరాలకు 91364 46666, 99592 25979, 99592 25965లను సంప్రదించవచ్చని కోరారు.
News October 28, 2025
మొంథా తుపాను.. అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం కలెక్టర్

మొంథా తుపాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. రానున్న 2, 3 రోజుల పాటు రైతులు పంట కోతలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా కోతలను తాత్కాలికంగా వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పంటలను రక్షించే చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తూ కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ఫలించిన తుమ్మల కృషి.. ఖమ్మంకు రూ.200 కోట్లు

ఖమ్మం నగరానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో రూపొందిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడవునా మున్నేరు, పాలేరుల నుంచి నీటి సరఫరా జరగనుంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆధునిక పైపులైన్, ఫిల్టర్ బెడ్ వ్యవస్థలు ఏర్పాటవనున్నాయి. ఖమ్మం నగర అభివృద్ధికి ఇది మైలు రాయి అని నగర ప్రజలు మంత్రి తుమ్మల కృషిని ప్రశంసిస్తున్నారు.


