News October 27, 2025
ఏలూరు జిల్లాలో హై అలర్ట్ ప్రకటన

మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు జిల్లాలోని 13 మండలంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ వెట్రీ సెల్వి అన్నారు. జిల్లాలోని 14 మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో జిల్లాలోని 763 హోర్డింగ్స్‌ను తొలగించామన్నారు. ముంపు గ్రామాలలో 100 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశామన్నారు.123 మంది గర్భిణీలను ఆస్పత్రికి తరలించామన్నారు.
Similar News
News October 28, 2025
LRS గడువు పొడిగింపు

AP: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. తొలుత ప్రకటించిన గడువు ఈనెల 23తో ముగియగా, వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 3 నెలల్లో 40వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 28, 2025
సంగారెడ్డి: 3,750 ఏకరాల్లో ఆయిల్ పామ్ సాగు

సంగారెడ్డి జిల్లాలో 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే కృషి చేయాలని, ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
News October 28, 2025
NZB: నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. బస్టాండ్ ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి కింద పడి ఉండగా స్థానికులు, పోలీసుల సహకారంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు సదురు వ్యక్తిని పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతుడు వయసు 50 నుంచి 55 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.


