News April 9, 2024
తిరుపతి MP అభ్యర్థిగా చింతామోహన్

కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన ఇప్పటి వరకు 6 సార్లు తిరుపతి ఎంపీగా గెలిచారు. అలాగే ఇటీవల వైసీపీని వీడి హస్తం గూటికి చేరిన MS బాబుకు పూతలపట్టు MLA టికెట్ దక్కింది. ఆయన 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆయనకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో పార్టీ మారారు. జీడీనెల్లూరు కాంగ్రెస్ MLA అభ్యర్థిగా రమేశ్ బాబు పోటీ చేయనున్నారు.
Similar News
News January 1, 2026
పార్లమెంటులో 101 అడిగిన మిథున్ రెడ్డి

2025వ సంవత్సరంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంటులో వివిధ సమస్యలపై మొత్తం 101 ప్రశ్నలు అడిగారు. ఆయన హాజరు శాతం 55%గా ఉంది. మొత్తం 12 చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్, ఉపాధి హామీ పథక అమలుపై నిర్వహించిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు.
News January 1, 2026
చిత్తూరు MPకి 94 శాతం హాజరు

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్ లో ఆయన పాల్గొన్నారు.
News January 1, 2026
చిత్తూరు కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్‌ను పలువురు అధికారులు గురువారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బొకేలు, పండ్లు అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో JC విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్, మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎస్ఎస్పీఎ వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఐఅండ్ పీఆర్ అధికారి వేలాయుధం తదితరులు ఉన్నారు.


