News October 27, 2025
AP: ‘మొంథా’ తుఫాన్ అలర్ట్స్

* ఉత్తర-వాయవ్య దిశగా గంటకు 15km వేగంతో కదులుతున్న తుఫాను
* రేపు సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
* 44 మున్సిపాలిటీలు, 233 మండలాల్లోని 1,419 గ్రామాలపై ప్రభావం
* 2,194 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన ప్రభుత్వం
* కమ్యూనికేషన్ కోసం జిల్లాలకు 16 శాటిలైట్ ఫోన్లు, 35 డీఎంఆర్ సెట్లు పంపిణీ
* వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866-2424172, 0866-2422515, 0866-2427485 ఏర్పాటు
Similar News
News October 28, 2025
LRS గడువు పొడిగింపు

AP: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(LRS) దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. తొలుత ప్రకటించిన గడువు ఈనెల 23తో ముగియగా, వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువును పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 3 నెలల్లో 40వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 28, 2025
PKL: నేడు తెలుగు టైటాన్స్‌కు చావో రేవో

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో ఇవాళ తెలుగు టైటాన్స్, పట్నా పైరేట్స్ మధ్య ఎలిమినేటర్-3 మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రేపు క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. కాగా నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో పుణెరి పల్టాన్‌పై గెలిచిన దబాంగ్ ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. కాగా సూపర్ ఫామ్‌లో ఉన్న తెలుగు టైటాన్స్ ఈ సీజన్‌లోనైనా విజేతగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 28, 2025
సూర్య ఫామ్ లేమిపై ఆందోళన లేదు: గంభీర్

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య బ్యాటింగ్ ఫామ్‌పై ఆందోళన లేదని హెడ్ కోచ్ గంభీర్ తెలిపారు. ‘ఫియర్‌లెస్, అగ్రెసివ్‌గా ఆడాలన్నదే మా ఆలోచన. అలా ఆడినప్పుడు త్వరగా ఔటవ్వడం, మిస్టేక్స్ సహజం. 30 బంతుల్లో 40 రన్స్ చేస్తే విమర్శలకు దూరంగా ఉండొచ్చు. కానీ మా అప్రోచ్ అది కాదు. T20లకు కెప్టెన్‌గా సూర్య ఫర్ఫెక్ట్. జట్టును బాగా నడిపిస్తున్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. AUS, IND మధ్య తొలి T20 రేపు జరగనుంది.


