News October 27, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి: భద్రాద్రి కలెక్టర్

తెలంగాణ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా కొనుగోలు కొనసాగుతున్నదని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌలిక వసతులు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ కవర్లు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 28, 2025
ఆదిలాబాద్‌లో బుధవారం పత్తి మార్కెట్ బంద్

అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న పత్తి మార్కెట్ కు బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. Kapas Kisan యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్‌ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పత్తి తేవద్దన్నారు.
News October 28, 2025
KMR: 49 షాపుల్లో 12 వైన్సులు మహిళలకే!

కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లాటరీ ప్రక్రియలో మొత్తం 49 మంది అదృష్టవంతులు వైన్ షాపు లైసెన్స్‌లను దక్కించుకోగా, ఇందులో మహిళా శక్తి తన సత్తా చాటింది. మొత్తం విజేతల్లో ఏకంగా 12 మంది మహిళలు వైన్ షాపు లైసెన్స్‌లను గెలుచుకోవడం విశేషం.
News October 28, 2025
అమెజాన్‌లో 30వేల ఉద్యోగాల తొలగింపు?

అమెజాన్ కంపెనీ 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ్టి నుంచి లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కార్పొరేట్ వర్క్ ఫోర్స్ నుంచి ఈ తొలగింపులు ఉండనున్నట్లు పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా అమెజాన్ 1.54 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో కార్పొరేట్ ఎంప్లాయిస్ 3,50,000 మంది ఉంటారని అంచనా.


