News April 9, 2024
SKLM: ఉగాది ఎఫెక్ట్.. బంగారం షాపులు కిటకిట

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, పలాస, ఇతర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కళకళలాడాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా బంగారం, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. తెలుగు వారు చేసుకునే తొలి పండుగ ఉగాది. ఉగాది రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా అదే తరహాలో కొనుగోలు చేస్తుంటారని ఒక నమ్మకం.
Similar News
News October 26, 2025
SKLM: నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు

నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉరిటి సాయికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల31న జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంవద్ద ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలియజేశారు. ITI అర్హత కలిగి ఎలక్ట్రిషన్‌లో అనుభవం ఉండాలన్నారు. 30 ఏళ్లు కలిగి https://apssdc.inloలో నమోదు చేసుకోవాలన్నారు.
News October 26, 2025
పాతపట్నం: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. అబార్షన్ చేయడంతో మృతి

పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన పోలాకి అప్పారావు హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. 11 ఏళ్ళ కూతురిపై అఘాయిత్యం చేయడంతో గర్భవతి అయింది. అక్కడ ఉన్నవారికి తెలియకుండా శ్రీకాకుళం తీసుకొచ్చి అబార్షన్ చేయించగా ఆరోగ్యం వికటించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. అక్కడి వైద్యుల సమాచారం మేరకు పాతపట్నం ఎస్సై మధుసూదన రావు శనివారం కేసు నమోదు చేశారు.
News October 26, 2025
RAINS: శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రదర్ బాబు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్ర వాయుగుండం రూపంలో దూసుకొస్తుంది. ఈ తుఫాను నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిగా IAS చక్రదర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జిల్లా JC గా పనిచేసిన అనుభవం ఇతనికుంది.


