News October 28, 2025

HYD: జూబ్లీహిల్స్‌లో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..!

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా నేడు ఉపఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించింది. TPCC ఇన్‌ఛార్జ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొని, నేతలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, గ్రేటర్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఇక ఎన్నికల వరకు అందరూ జూబ్లీహిల్స్‌లోనే ఉంటూ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.

Similar News

News October 28, 2025

మానవులకు బాధలెందుకు కలుగుతాయి?

image

మానవులకు సుఖదుఃఖాలు కలగడానికి ముఖ్య కారణం మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మనం చేసే పనుల మీద, మనం చూసే, వినే, తినే విషయాల మీద మనకు ఇష్టం లేదా అయిష్టం అనే భావాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక విషయం నచ్చితే ఆనందం కలుగుతుంది. లేకపోతే బాధ కలుగుతుంది. ఈ విధంగా మన ఇష్టాలు, అయిష్టాల (రాగద్వేషాల) కారణంగానే మనుషులకు సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ రెండింటిని దాటితేనే శాంతి చేకూరుతుంది. <<-se>>#WhoIsGod<<>>

News October 28, 2025

ఆదిలాబాద్‌లో బుధవారం పత్తి మార్కెట్ బంద్

image

అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న పత్తి మార్కెట్ కు బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. Kapas Kisan యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్‌ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పత్తి తేవద్దన్నారు.

News October 28, 2025

KMR: 49 షాపుల్లో 12 వైన్సులు మహిళలకే!

image

కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లాటరీ ప్రక్రియలో మొత్తం 49 మంది అదృష్టవంతులు వైన్ షాపు లైసెన్స్‌లను దక్కించుకోగా, ఇందులో మహిళా శక్తి తన సత్తా చాటింది. మొత్తం విజేతల్లో ఏకంగా 12 మంది మహిళలు వైన్ షాపు లైసెన్స్‌లను గెలుచుకోవడం విశేషం.