News October 28, 2025
నీతులు చెప్పేవారు ఆచరించరు.. ట్రంప్‌పై జైశంకర్ పరోక్ష విమర్శలు

రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో US ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరిని మంత్రి జైశంకర్ పరోక్షంగా విమర్శించారు. ‘సెలక్టివ్‌గా నిబంధనలు వర్తింపజేస్తున్నారు. నీతులు బోధించే వారు వాటిని ఆచరించరు’ అని మండిపడ్డారు. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నా యూరప్‌పై US టారిఫ్స్ విధించకపోవడాన్ని ఉద్దేశిస్తూ ఆసియాన్ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంధన వాణిజ్యం పరిమితమవుతోందని, టెక్నాలజీ, సహజ వనరుల కోసం పోటీ పెరిగిపోయిందన్నారు.
Similar News
News October 28, 2025
మరోసారి బాలకృష్ణకు జోడీగా నయనతార?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుందని సమాచారం. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబోలో సింహా, శ్రీరామరాజ్యం సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
News October 28, 2025
మానవులకు బాధలెందుకు కలుగుతాయి?

మానవులకు సుఖదుఃఖాలు కలగడానికి ముఖ్య కారణం మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. మనం చేసే పనుల మీద, మనం చూసే, వినే, తినే విషయాల మీద మనకు ఇష్టం లేదా అయిష్టం అనే భావాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఒక విషయం నచ్చితే ఆనందం కలుగుతుంది. లేకపోతే బాధ కలుగుతుంది. ఈ విధంగా మన ఇష్టాలు, అయిష్టాల (రాగద్వేషాల) కారణంగానే మనుషులకు సుఖాలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ రెండింటిని దాటితేనే శాంతి చేకూరుతుంది. <<-se>>#WhoIsGod<<>>
News October 28, 2025
అమెజాన్‌లో 30వేల ఉద్యోగాల తొలగింపు?

అమెజాన్ కంపెనీ 30వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఇవాళ్టి నుంచి లేఆఫ్స్‌ను ప్రకటించే అవకాశం ఉందని పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కార్పొరేట్ వర్క్ ఫోర్స్ నుంచి ఈ తొలగింపులు ఉండనున్నట్లు పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా అమెజాన్ 1.54 మిలియన్ ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో కార్పొరేట్ ఎంప్లాయిస్ 3,50,000 మంది ఉంటారని అంచనా.


