News April 9, 2024

భారీగా పడిపోయిన పేటీఎం UPI విలువ

image

పేమెంట్స్ బ్యాంక్ సంక్షోభం దెబ్బ పేటీఎం UPI మార్కెట్ షేర్‌పై భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మార్చిలో ఈ విలువ (9%) నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఫిబ్రవరిలో పేమెంట్స్ బ్యాంక్‌‌పై RBI ఆంక్షలు విధించినప్పుడు ఈ విలువ 11%కి తగ్గింది. UPI కన్నా వాలెట్‌పైనే సంస్థ ఎక్కువగా దృష్టి సారించడం ఈ క్షీణతకు మరో కారణం అంటున్నారు నిపుణులు. మరోవైపు గత రెండు నెలల్లో ఫోన్‌‌పే మార్కెట్ షేర్ 50% పెరగడం గమనార్హం.

Similar News

News October 10, 2024

హీరోయిన్‌తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్‌లో ఆయన ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్‌‌గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 10, 2024

Stock Markets: భారీ లాభాల వైపు..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినప్పటికీ హెవీవెయిట్స్ అండతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. BSE సెన్సెక్స్ 81,780 (+310), NSE నిఫ్టీ 25,072 (+90) వద్ద కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్, NTPC, కొటక్ బ్యాంక్, M&M, ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్. అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్స్.

News October 10, 2024

RATAN TATA: ‘ఏత్ బార్’ నిర్మాత కూడా

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతితో బాలీవుడ్ కూడా మూగబోయింది. ఆయన నిర్మించిన సినిమాను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. 2004లో ‘ఏత్ బార్’ అనే చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. విక్రమ్ భట్ రూపొందించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ ‘ఫియర్’ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత టాటా మళ్లీ సినిమాల వైపు తొంగి చూడలేదు.