News April 9, 2024
సంతమాగులూరులో రేపు సీఎం బస్సు యాత్ర

సంతమాగులూరు మండలంలో రేపు సీఎం జగన్ మేము సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. 12వ రోజు యాత్రలో భాగంగా జగన్ గంటవారిపాలెం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు. జిల్లా పరిధిలోని వెల్లలచెరువు, కామేపల్లి పుట్టవారిపాలెం జంక్షన్‌లలో ఈ యాత్ర సాగనుందని పార్టీ నేతలు తెలిపారు. విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారని చెప్పారు.
Similar News
News March 8, 2026
ప్రకాశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష

ప్రకాశం జిల్లా యువతకు నైపుణ్యాలు అందించేందుకు జిల్లాస్థాయిలో అడ్వాన్సుడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. సుంచూరియా యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేయాలని, అడ్వాన్స్డ్ కోర్సులపై శనివారం ప్రకాశం భవన్‌లో కలెక్టర్ రాజాబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికార రవితేజ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
News March 7, 2026
పెద్ద దోర్నాల వద్ద ప్రమాదం.. యువకుడు స్పాట్‌డెడ్

పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెలుగొండ ప్రాజెక్టు వైపు వెళ్తున్న వింగర్ బొమ్మలపురం చెంచు కాలనీ వైపు వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.


