News April 9, 2024
తిహార్ జైలులో ఢిల్లీ సీఎంను కలవనున్న పంజాబ్ సీఎం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో రేపు భేటీ కానున్నారు. మాన్ వెంట ఇటీవల జైలు నుంచి రిలీజైన ఆప్ నేత సంజయ్ సింగ్ సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఈ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగా నేడు కేజ్రీవాల్ సతీమణి సునీత తిహార్ జైలులో ఆయనను కలుసుకున్నారు. అరెస్ట్ తర్వాత వీరు భేటీ కావడం ఇదే తొలిసారి.
Similar News
News July 6, 2025
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేశుల నుంచి 1.86 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 67వేల క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 879.30 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 180.42 TMCలుగా ఉంది. 2 రోజుల్లో గేట్లు ఎత్తే ఛాన్స్ ఉంది.
News July 6, 2025
చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

TG: రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అచ్చంపేటలోని మున్ననూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు తొలి విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 3,371, అత్యల్పంగా నాగార్జునసాగర్‌లో 17 ఇళ్లు కేటాయించారు.
News July 6, 2025
మా విషయం ఇండియా మొత్తం తెలుసు: చాహల్

ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్‌పై టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించారు. కపిల్ శర్మ షోలో అతడి డేటింగ్ ప్రస్తావన వచ్చింది. ‘కౌన్ హై వో లడ్కీ’ అంటూ కపిల్ ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ ‘నాలుగు నెలల కిందటే మా డేటింగ్ విషయం ఇండియా మొత్తం తెలుసు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.