News October 28, 2025
KMR: ఆనందడోలికల్లో కొందరు..ఆశలు ఆవిరిగా మరికొందరు!

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య కామారెడ్డి జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఒక్కో దరఖాస్తుదారు పేరును లాటరీ పెట్టెలోంచి తీసి ప్రకటించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే, విజేతల ఆనందం పక్కనే, లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి.
Similar News
News October 29, 2025
గంజాయి లేడి డాన్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ గంజాయి లేడీ డాన్‌గా పేరుగాంచిన అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. పీడీ యాక్ట్‌పై ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ధూల్‌పేట్ నుంచి గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ అనేక కేసుల్లో నిందితురాలైన అంగూర్ భాయ్‌పై ప్రభుత్వం అమలు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుపై ఎక్సైజ్ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
News October 29, 2025
బెల్లంపల్లి: ‘భౌతిక దాడులకు బదులు సాంకేతిక దాడులు’

గతంలో ఆర్థిక నేరాలు భౌతిక దాడులతో జరిగేవని, నేడు సాంకేతికత టెక్నాలజీతో జరుగుతున్నాయని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి అన్నారు. జీఎం కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉద్యోగులు వారి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, కుటుంబ సభ్యుల ఫొటోలు అంతర్జాలంలో పొందుపరచవద్దని సూచించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు క్విజ్ నిర్వహించి బహుమతులు అందజేశారు.
News October 29, 2025
అంగరంగ వైభవంగా ఉద్దాల మహోత్సవం

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన ఉద్దాలమహోత్సవం మంగళవారంరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో చిన్నవడ్డేమాన్, ఊకచెట్టువాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్ గ్రామాలతోపాటు స్వామి ఆలయం వరకు జనసంద్రంమైంది. ఉత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.


