News October 28, 2025
సంగారెడ్డి: 3,750 ఏకరాల్లో ఆయిల్ పామ్ సాగు

సంగారెడ్డి జిల్లాలో 3,750 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. లక్ష్య సాధన కోసం వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటినుంచే కృషి చేయాలని, ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 28, 2025
సిద్దిపేటలో ధాన్యం తడిసి ముద్ద.. అన్నదాతల ఆందోళన

సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నేడు కూడా వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కవర్లు కప్పినా నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తితే నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తేమ శాతం, నిబంధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
News October 28, 2025
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని, ప్రస్తుతం 4 కంపార్ట్మెంట్ లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 70,842 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 25,125 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.
News October 28, 2025
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు రికార్డు ధర!

వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. నిన్న వేలంలో కేజీ రూ.454 పలికి చరిత్ర సృష్టించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఐదు పోగాకు కేంద్రాల్లో వేలం జరగ్గా.. గోపాలపురంలో రూ.454 ధర పలికింది. ఇటీవల పలికిన అత్యధిక ధర రూ.430, రూ.420, రూ.415. కాగా ఈ ఏడాది మొదట్లో కేజీ రూ.290 మాత్రమే పలకడంతో రైతులు నిరాశ చెందారు. తర్వాత క్రమంగా పెరుగుతూ ఎక్కువ కాలం రూ.350 వద్ద నమోదు అవుతూ వచ్చింది.


