News April 9, 2024

‘GHMC’లో అడుగంటుతున్న భూగర్భజలాలు

image

TG: GHMC పరిధిలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలవనరుల శాఖ వివరాల ప్రకారం.. మార్చి-2023 నుంచి మార్చి-2024 మధ్యలో స్థాయులు 2 నుంచి 7 మీటర్ల వరకు పడిపోయాయి. అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 7 మీటర్ల మేర నీటి స్థాయులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఏడాదంతా నిర్మాణాలు జరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు. బెంగళూరు తరహా ఇబ్బంది మాత్రం ఇప్పుడే రాదని తెలిపారు.

Similar News

News October 10, 2024

పల్లెల్లో పెరిగిన టెలికం వినియోగం

image

టెలికం కంపెనీల ఆదాయం జూన్‌‌తో ముగిసిన త్రైమాసికానికి 8% పెరిగినట్లు ట్రాయ్ వెల్లడించింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే నెలవారి సగటు ఆదాయం రూ.157.45గా ఉంది. గత మార్చికి ఇది రూ.153.54గా ఉంది. టెలికం రంగం స్థూల ఆదాయం 0.13% పెరిగి రూ.70,555 కోట్లుగా ఉంది. పల్లెల్లో టెలికం వినియోగం 59.19% నుంచి 59.65%కి పెరగ్గా, పట్టణాల్లో 133.72% నుంచి 133.46%కి తగ్గింది. టెలిఫోన్ చందాదారుల సంఖ్య 1205.64 మిలియన్లుగా ఉంది.

News October 10, 2024

హీరోయిన్‌తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్‌లో ఆయన ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్‌‌గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 10, 2024

Stock Markets: భారీ లాభాల వైపు..

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినప్పటికీ హెవీవెయిట్స్ అండతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. BSE సెన్సెక్స్ 81,780 (+310), NSE నిఫ్టీ 25,072 (+90) వద్ద కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్, NTPC, కొటక్ బ్యాంక్, M&M, ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్. అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్స్.