News October 28, 2025
ఉదయాన్నే టీ, కాఫీ తాగుతున్నారా?

ఉదయం లేవగానే కాఫీ, టీ తాగితేనే కానీ చాలామంది కాలకృత్యాలు పూర్తి చేయలేరు. అయితే ఇదెంతమాత్రం మంచిది కాదంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సుశీల్ శర్మ. ‘టీ, కాఫీలు ముందు పెద్దపేగును కదిలిస్తాయి. తరువాత అదే అలవాటుగా మారి చివరకు పేగుల సహజ రిథమ్‌ను దెబ్బతీస్తాయి. ఆపై పొట్టలో ఇరిటేట్ చేస్తాయి. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి’ అని పేర్కొన్నారు. వాటి బదులు గోరువెచ్చని నీటిని సేవించాలని సూచించారు.
Similar News
News October 28, 2025
NOV 1 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్

ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న పొల్యూషన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. NOV 1 నుంచి నగరంలో BS-4, BS-5 డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. BS-6 డీజిల్ వాహనాలను మాత్రమే అనుమతించనుంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ రూల్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు వేయాలంది. అన్ని మేజర్ ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
News October 28, 2025
రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు: కవిత

TG: మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, ఆయనను ప్రజలు క్షమించరని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ‘జనంబాట’లో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఫైరయ్యారు.
News October 28, 2025
2 రాష్ట్రాల్లో ఓట్లు… పీకేకు EC నోటీసులు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్‌కు EC నోటీసులు జారీ చేసింది. ఆయనకు 2 రాష్ట్రాల్లో ఓటు ఉండడమే దీనికి కారణం. పీకే WBలో ఓటరుగా ఉన్నారు. తర్వాత కర్గహార్ (బిహార్) నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యారు. రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్‌లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.


