News October 28, 2025
విశాఖ: ఇంటి పన్ను మార్చడానికి రూ.50,000 లంచం

తగరపువలసకు చెందిన పి.దుర్గారావు తన తాత పేరు మీద ఉన్న ఇంటి పన్నును భార్య, మరదలు పేరుమీద మార్చడానికి సచివాలయానికి వెళ్లాడు. ఈ పనికి రూ.50,000 లంచం కావాలని సచివాలయం సెక్రటరీ సోమునాయుడు, ఆర్‌ఐ రాజు అడగడంతో దుర్గారావు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.
Similar News
News October 28, 2025
సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.
News October 28, 2025
వనపర్తి: బాల్యవివాహానికి సహకరించే వారిపై కేసులు

బాల్య వివాహానికి సహకరించే ప్రతి ఒక్కరి పై కేసు నమోదు చేస్తామని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. మధ్యలో చదువు మానేసిన ప్రతి అమ్మాయిని గుర్తించి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి విద్యాలయాల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 36 బాల్య వివాహాలు జరుగకుండా ఆపి బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News October 28, 2025
ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్ కట్టడి

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్ రిలీజై రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.


