News October 28, 2025
ADB: సెల్ ఫోన్ పోయిందా.. ఇలా చేయండి లేకుంటే ప్రమాదమే

సెల్ ఫోన్లు చోరీకి గురైనా, మనం పోగొట్టుకున్నా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారం సేకరించి బ్యాంకుల్లోని డబ్బులు లూటీ చేసే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలంటే ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో కంప్లైంట్ చేయాలి. లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అప్పుడు పోలీసులు ఫోన్ ను ట్రేస్ చేసి అందిస్తారు. జిల్లాలో గత మూడేళ్లలో సుమారు 1300 ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు అప్పగించారు.
Similar News
News October 28, 2025
సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.
News October 28, 2025
వనపర్తి: బాల్యవివాహానికి సహకరించే వారిపై కేసులు

బాల్య వివాహానికి సహకరించే ప్రతి ఒక్కరి పై కేసు నమోదు చేస్తామని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. మధ్యలో చదువు మానేసిన ప్రతి అమ్మాయిని గుర్తించి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి విద్యాలయాల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 36 బాల్య వివాహాలు జరుగకుండా ఆపి బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News October 28, 2025
ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్ కట్టడి

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్ ట్రైనింగ్, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్ రిలీజై రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.


