News October 28, 2025
HYD: షుగర్ ఉందా? మీ కోసం ప్రత్యేక చెప్పులు

డయాబెటిక్ పేషెంట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరిండెంట్ డా.రాకేశ్ సహాయ తెలిపారు. ఉస్మానియాలో డయాబెటిక్ ఫుట్ క్లినిక్ ద్వారా రోగులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కాళ్లకు తిమ్మిర్లు, స్పర్శ లేకపోవడం, గాయాలు నయం కాకపోవడం వంటి లక్షణాలు కనిపించే వారు తప్పనిసరిగా ఈ సేవలను పొందాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి విషమించొచ్చని హెచ్చరించారు.
Similar News
News October 28, 2025
HYD: ఓపెన్ యూనివర్సిటీలో నవంబర్ 13 వరకు అవకాశం

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019-24 డిగ్రీ(BA/B.COM/BSC) విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు NOV 13 వరకు అవకాశం ఉందని విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా.Y.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. 2022-2024లో PG (MA/ M.COM/ MSC) అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం www.braouonline.inను సందర్శించాలని ఆయన సూచించారు.
News October 28, 2025
HYDలోనూ పెరుగుతున్న లగ్జరీ హౌసెస్!

భారతదేశంలోని విలాసవంతమైన నగరాల్లో లగ్జరీ గృహాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే తర్వాత HYD, చెన్నై, కోల్‌కత్తా వంటి 7 ప్రధాన నగరాల్లో 2025 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 55,640 లగ్జరీ గృహాలు విక్రయమైనట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ గుణాంకాలు తెలిపాయి. మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
News October 28, 2025
మహా ప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తి

మాజీమంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోకాపేటలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై.. మహా ప్రస్థానం వద్ద ముగిసింది. అంతిమయాత్రలో మాజీమంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్యకర్తల కన్నీటి వీడుకోలు మధ్య సత్యనారాయణ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హరీశ్ రావు తన తండ్రి సత్యనారాయణ రావు చితికి నిప్పంటించి, దహన కార్యక్రమాలు పూర్తి చేశారు.


