News October 28, 2025
ASF: ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్ట్: ఎస్పీ

సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సోమవారం తెలిపారు. గత మే 21న వాట్సాప్ లింక్ పంపించి ఆసిఫాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1.66 లక్షలు కాజేశారు. అదే నెల 27న బాధితుడు ఆసిఫాబాద్ పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు రూ.60 వేలను ఫ్రీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News October 28, 2025
తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
News October 28, 2025
సూర్యాపేట: ప్రజలకు సుపరిపాలన అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సరైన రీతిలో ప్రజలకు చేరే విధంగా అధికారులు పారదర్శకతతో, బాధ్యతగా విధులు నిర్వహించి అర్హులైన వారిని మాత్రమే గుర్తించాలన్నారు.
News October 28, 2025
5,407 మంది నిర్వాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

మొంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో 5,407 మంది నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 119 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి వసతి కల్పించామన్నారు. అత్యవసర సహాయం నిమిత్తం వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు.


