News October 28, 2025

ప్రతి ఊర్లో హనుమాన్ ఆలయం ఎందుకు ఉంటుంది?

image

హనుమంతుడు అపారమైన శక్తి, ధైర్యం, నిస్వార్థ భక్తికి ప్రతీక. ప్రజలు ఆయనను కష్టాలను తొలగించే ఆపద్బాంధవుడిగా, ఆరోగ్య ప్రదాతగా నమ్ముతారు. రాముని సేవలో ఆయన చూపిన నిష్ఠ కారణంగా ఆయన్ని ఎక్కడ పూజించినా రాముని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే గ్రామాన్ని, ప్రజలను రక్షించే రక్షక దేవతగా ప్రతి ఊరిలో ఆయన ఆలయాన్ని నిర్మించడం భారతీయ సంప్రదాయంగా మారింది. ఆయనను పూజిస్తే ధైర్యం, బలం లభిస్తాయని నమ్ముతారు.

Similar News

News October 28, 2025

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

image

TG: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్‌పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రాలో వాన పడుతోంది. రాత్రి 7.30 గంటల్లోపు నగరమంతా వర్షం విస్తరిస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

image

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్‌ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.

News October 28, 2025

ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్‌ కట్టడి

image

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్‌ కోవాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్‌ రిలీజై రొమ్ము క్యాన్సర్‌ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.