News October 28, 2025
ఆలేరులో అధిక వడ్డీ, బిట్ కాయిన్ల దందా

ఆలేరులో అధిక వడ్డీ వ్యాపారం జోరుగా నడుస్తోంది. కొందరు వడ్డీ వ్యాపారులు బాధితుల నుంచి ముందుగానే తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకుని ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. అలాగే బిట్ కాయిన్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గంలోనూ బినాన్స్ వ్యవహారంపై గతంలో వార్తలొచ్చాయి. అధిక డబ్బుకు ఆశపడి జీవితాలు ఆగం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News October 29, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్‌తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.
News October 29, 2025
SRPT: విధి నిర్వహణలో అలసత్వం వహించొద్దు: ఎస్పీ

పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎస్పీ నర్సింహ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ వారిగా నమోదైన కేసులు, కేసు విచారణ గురించి అధికారులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యాప్ ద్వారా లోన్ ఇస్తామని చెప్పేవారి మాటలను నమ్మొద్దని సూచించారు.
News October 29, 2025
జనగామలో నవంబర్ 1 నుంచి శాతవాహన ట్రైన్ హాల్టింగ్

నవంబర్ 1 నుంచి జనగామలో శాతవాహన ట్రైన్‌కు హాల్టింగ్ ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు దశమంత్ రెడ్డి తెలిపారు. జనగామలో శాతవాహన ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవను కోరగా జనగామలో శాతవాహనకు హాల్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.


