News October 28, 2025

HYD: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

image

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై మధురానగర్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. 26న లక్ష్మీ నరసింహనగర్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనం డ్రైవర్‌ను హెచ్చరిస్తూ, సైగలు చేస్తూ వెళ్లాడు. ఈ ఘటనను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ వీడియో తీసి పోలీసులకు అందించగా కేసు నమోదు చేశారు.

Similar News

News October 28, 2025

పెద్దపల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు

image

మై భారత్ (భారత ప్రభుత్వం), యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్తిపాక సంయుక్తాధ్వర్యంలో పెద్దపల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఐటీఐ కళాశాల మైదానంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు ఈ పోటీలు జరుగుతాయి. కబడ్డీ, వాలీబాల్‌, చెస్‌, షాట్‌పుట్, బ్యాడ్మింటన్‌ వంటి క్రీడలు ఉంటాయని నిర్వాహకులు మహేష్ తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల యువతీ యువకులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

News October 28, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 28, 2025

సుంకేసులకు కొనసాగుతున్న వరద

image

రాజోలి మండలంలోని సుంకేసుల జలాశయానికి వరద కొనసాగుతుంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకల ద్వారా వచ్చిన నీటితో జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 56,500 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో బ్యారేజీ 13 గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 52,364 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 458 క్యూసెక్కులు, మొత్తం 52,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.