News October 28, 2025
సూళ్లూరుపేట : SHARలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11.
Similar News
News October 28, 2025
పెద్దపల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు

మై భారత్ (భారత ప్రభుత్వం), యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్తిపాక సంయుక్తాధ్వర్యంలో పెద్దపల్లిలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఐటీఐ కళాశాల మైదానంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు ఈ పోటీలు జరుగుతాయి. కబడ్డీ, వాలీబాల్, చెస్, షాట్‌పుట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు ఉంటాయని నిర్వాహకులు మహేష్ తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల యువతీ యువకులు ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
News October 28, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 28, 2025
సుంకేసులకు కొనసాగుతున్న వరద

రాజోలి మండలంలోని సుంకేసుల జలాశయానికి వరద కొనసాగుతుంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకల ద్వారా వచ్చిన నీటితో జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 56,500 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో బ్యారేజీ 13 గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 52,364 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 458 క్యూసెక్కులు, మొత్తం 52,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


