News October 28, 2025
నిత్యారాధన ఫలితాలు

శివ మహాపురాణం ప్రకారం.. నిత్యారాధన విశేష ఫలితాలనిస్తుంది. ఆదివారం సూర్యారాధన నేత్ర, శిరో, చర్మ రోగాలను పోగొడుతుంది. అన్నదానం చేయడం శుభకరం. సంపద కోసం సోమవారం లక్ష్మీదేవిని, రోగ నివారణకై మంగళవారం కాళిని, కుటుంబ క్షేమం కోసం బుధవారం విష్ణువును, ఆయువుకై గురువారం, భోగాలకై శుక్రవారం సకల దేవతలను, అపమృత్యువు నివారణకై శనివారం రుద్రాది దేవతలను పూజించాలి. ఈ నిత్యారాధనలు మనకు సకల శుభాలు కలిగిస్తాయి. <<-se>>#SIVOHAM<<>>
Similar News
News October 28, 2025
కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

బిహార్‌ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్‌ను పప్పెట్‌గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.
News October 28, 2025
BIG ALERT: కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిన తుఫాను

AP: మొంథా తుఫాను కాకినాడ-యానాం మధ్య తీరాన్ని తాకిందని APSDMA ప్రకటించింది. యానాం- అంతర్వేదిపాలెం దగ్గర తీవ్రమైన తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటేందుకు 3-4 గంటలు పడుతుందని వెల్లడించింది. తీరప్రాంత జిల్లాల్లో గంటకు 90-100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
News October 28, 2025
‘మొంథా’ తుఫాన్.. సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధం

* అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం 488 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
* ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు
* పలు జిల్లాల్లో 219కి పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు
* అత్యవసర కమ్యూనికేషన్ కోసం 81 వైర్‌లెస్ టవర్లు ఏర్పాటు
* సహాయక చర్యలకు 321 డ్రోన్లు సిద్ధం, అందుబాటులో JCBలు, క్రేన్లు
* ఇప్పటికే 38 వేల హెక్టార్లలో పంట నష్టం, 1.38 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల అంచనా


