News October 28, 2025
సిద్దిపేటలో ధాన్యం తడిసి ముద్ద.. అన్నదాతల ఆందోళన

సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. నేడు కూడా వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కవర్లు కప్పినా నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తితే నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. ప్రభుత్వం తేమ శాతం, నిబంధనలను సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
Similar News
News October 28, 2025
కాల్స్ అన్నీ రికార్డ్ చేస్తారంటూ ప్రచారం.. నిజమిదే

వాట్సాప్ కాల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. అన్ని ఫోన్ కాల్స్ రికార్డు చేసి సేవ్ చేస్తారని, సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్‌ను నమ్మొద్దని సూచించారు. ‘ఈ పోస్టర్‌లోని సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దీనిని విడుదల చేయలేదు. దీనిని ఎవరూ షేర్ చేయొద్దు’ అని Xలో రాసుకొచ్చారు.
News October 28, 2025
కల్లుపై నిషేధం ఎత్తేస్తాం: తేజస్వీ యాదవ్

బిహార్‌ను దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని RJD నేత తేజస్వీ యాదవ్ అన్నారు. తమ మ్యానిఫెస్టో దీనికి రోడ్ మ్యాప్ అని చెప్పారు. ‘మేం గెలిస్తే కల్లుపై నిషేధం ఎత్తేస్తాం. అవినీతి అధికారులు, బీజేపీ నేతలు CM నితీశ్‌ను పప్పెట్‌గా చేశారు. NDA ఆయనను మళ్లీ సీఎం చేయదు’ అని పేర్కొన్నారు. కాగా తాము ఎక్కువ సీట్లు గెలుస్తామని అభిషేక్ బెనర్జీ (TMC) అన్నారు. OPS అమలు చేస్తామని దీపాంకర్ భట్టాచార్య(CPI) తెలిపారు.
News October 28, 2025
ములుగు: మావోయిస్టు సీసీ కమిటీ కార్యదర్శిగా దేవ్ జీ

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఎన్నికైనట్లు నేడు డీజీపీ ఎదుట లొంగిపోయిన సీసీ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు@చంద్రన్న తెలిపారు. దీంతో గత కొన్ని రోజులుగా సీసీ కమిటీ కార్యదర్శి ఎవరనే విషయానికి తెరపడింది. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ఆయన చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాగా, నేడు చంద్రన్నతో పాటు బండి ప్రకాశ్ లొంగిపోయిన విషయం తెలిసిందే.


