News April 9, 2024
NRPT: ‘అభివృద్ధికి నిధులు తెచ్చినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా’

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట ప్రాంతం అభివృద్ధికి డీకే అరుణ నిధులు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే పోటీలో నుండి తప్పుకుంటానని అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 15న నారాయణపేటలో నిర్వహించే జన జాతర సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని చెప్పారు.
Similar News
News April 21, 2025
రైతులకు భూ భారతి భరోసా: కలెక్టర్

అడ్డాకల్: పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.
News April 21, 2025
MBNR: ‘చెరువులలో పూడికతీత చేపట్టాలి’

జిల్లాలోని చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు చేపట్టాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పూడికతీత పనులు చేపట్టడం ద్వారా చెరువులు, కుంటలలో నీరు ఎక్కువగా నిలిచి చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. చేపల వేట, విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
News April 21, 2025
రేపే ఇంటర్ ఫలితాలు.. MBNRలో 22,483 మంది

తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 22,483 ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఫస్టియర్‌లో 10,922, సెకండియర్‌లో 11,561 మందికి పరీక్షలు నిర్వహించారు. కాగా వీరి భవితవ్యం రేపటితో తేలనుంది. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి.
– ALL THE BEST