News October 28, 2025
HYD: రాత్రి భారీ వర్షం.. పలుచోట్ల చిరుజల్లులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, నాచారం, తార్నాక, హబ్సిగూడ, శివంరోడ్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, కందుకూరు తదితర ప్రాంతాల్లో రాత్రి 1 నుంచి ఉ.3వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లగా మారింది. రోడ్లపై నీరు నిలిచింది. ఆఫీసు సమయాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. ఈరోజు సాయంత్రం గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురిస్తుందని అధికారులు అంచనా వేశారు.
Similar News
News October 28, 2025
యూసుఫ్‌గూడలో CM మాట.. కార్మికుల్లో కొత్త ఆశలు

కృష్ణానగర్.. సినీ కార్మికుల అడ్డా. యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి వెంకటగిరి వరకు ఉ.6 గంటలకే హడావిడి ఉంటుంది. ఈరోజు మాత్రం కొత్తగా ఉంది. సినీ కార్మికుల కోసం CM రావడంతో సందడి కనిపించింది. రేవంత్‌ని చూడాలన్న ఉత్సాహంతో వేలాదిమంది పోలీస్ గ్రౌండ్‌కు క్యూ కట్టారు. CM నోటి నుంచి శుభవార్త కూడా విన్నారు. టికెట్ల పెంపులో 20 శాతం కార్మికులకు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పడంతో కార్మికుల ఉత్సాహం రెట్టింపయ్యింది.
News October 28, 2025
రేపు ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవు

జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటించారు. తుఫాను తీరం దాటడంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 28, 2025
ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

బాపట్ల జిల్లాలో తుపాన్ ప్రభావం నేపథ్యంలో విద్యుత్, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. తుపాన్ వల్ల నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు సూచనల మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. వాగుల వద్ద ప్రజలు రోడ్లు దాటకుండా, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


