News October 28, 2025
జగిత్యాల: రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు

మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు, వరి కోత యంత్రాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ సూచించారు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటికే పంటలు కోతకు సిద్ధంగా ఉండడంతో రైతులు కోతలను వాయిదా వేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత కోతల పనులు ప్రారంభించాలని కోరారు.
Similar News
News October 28, 2025
SRPT: ‘సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాలి’

సమాజంలో శాస్త్రీయ వైఖరులు పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. మూఢ నమ్మకాలను పారద్రోలి శాస్త్రీయ వైఖరులను పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, సభ్యులు రామచంద్రయ్య దయానంద్ ఉన్నారు.
News October 28, 2025
పెద్దపల్లి యార్డులో పత్తికి గరిష్టంగా రూ.6,788 ధర

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం క్వింటాల్ పత్తి ధర 7,017 పలకగా, మంగళవారం పత్తి క్వింటాల్ కు రూ.6788 పలికినట్లు తెలిపారు. ఈ రోజు గరిష్టంగా రూ.6,788, కనిష్టంగా రూ.5,371, సగటు ధర రూ.6,571గా నమోదైంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 321 మంది రైతులు తీసుకువచ్చిన 907.20 క్వింటాల్ పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెట్ ఇన్‌చార్జి కార్యదర్శి మనోహర్ తెలిపారు.
News October 28, 2025
టీటీడీ ఛైర్మన్‌పై అంబటి పంచులు

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. ట్విట్టర్ వేదికగా ఏకాదశి దర్శన నిర్ణయంపై బుద్ధి మార్చి నందుకు భూమనకు, బుద్ధి మార్చుకున్నందుకు బీఆర్ నాయుడుకి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా వైకుంఠ ద్వార దర్శనాలు రెండు నిర్వహిస్తారనే ప్రచారం జోరుగా కొనసాగింది. ఈరోజు ఆ ప్రచారానికి బ్రేక్ పడింది.


