News October 28, 2025
శ్రీరాంపూర్: ‘సింగరేణి మాజీ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి’

సీపీఆర్ఎంఎస్ స్కీమ్‌లో సభ్యత్వం ఉన్న సింగరేణి మాజీ ఉద్యోగులు నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని సంస్థ జీఎం (పర్సనల్) జీవీకే కుమార్ తెలిపారు. డిజిటల్ మాధ్యమంలో జీవన్ ప్రమాణ్ ఆండ్రాయిడ్ ద్వారా మొబైల్ ఫోన్లలో లేదా మీ సేవ కేంద్రంలో సమర్పించి నిరాటంకంగా వైద్య సేవలు పొందాలని సూచించారు. పూర్తి వివరాలకు తమ ఏరియాలోని ఏటీబీ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.
Similar News
News October 29, 2025
వరంగల్: పక్షుల కోసం గూళ్లు..!

వరంగల్(D) పర్వతగిరి(M) కల్లెడలోని ఓ పాఠశాలలో పక్షులకు ఆహారం, నీరు అందించడానికి గాను ప్రత్యేకంగా గూళ్లను ఏర్పాటు చేశారు. రేకు డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్లు, వెదురు బుట్టలను పక్షుల గూళ్ల మాదిరిగా తయారుచేసి పాఠశాల ఆవరణలోని చెట్లకు వేలాడదీశారు. అందులో గింజలతో పాటు నీళ్లను పెట్టడంతో పక్షులు అక్కడికి వచ్చి తమ ఆకలిని, దాహర్తిని తీర్చుకుంటున్నాయి. దీంతో నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు.
News October 29, 2025
రెడ్ అలర్ట్‌లో ఆ జిల్లాలు: మంత్రి లోకేశ్

AP: తుఫాను వల్ల రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అత్యధిక తీవ్రత కలిగిన ప్రాంతాలుగా గుర్తించాం. అవి రెడ్ అలర్ట్‌లో ఉన్నాయి. ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనేదే మా లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఈ రాత్రికి ఆయన RTGS కేంద్రంలోనే బస చేయనున్నారు.
News October 29, 2025
జగిత్యాల: ST యువతకు ఉపాధి అవకాశాలు

తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎస్టీ నిరుద్యోగ యువతీయువకులకు ఆన్‌లైన్ ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే.రాజ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ఆసక్తిగల ఎస్టీ నిరుద్యోగులు https://deet.telangana.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.


