News October 28, 2025

వరంగల్: రూ.25 తగ్గిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మళ్లీ తగ్గింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.6,925 పలకగా.. నేడు రూ.25 తగ్గి, రూ. 6,900 కి చేరింది. పత్తి ధరలు క్రమంగా తగ్గుతుండడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

Similar News

News October 28, 2025

అరటి గెలల నాణ్యత పెరగాలంటే?

image

అరటిలో పండు పరిమాణం, నాణ్యత పెంచేందుకు గెలల్లోని ఆఖరి హస్తం విచ్చుకున్న 5వ రోజు మరియు 15వ రోజున లీటరు నీటికి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములను కలిపి గెలలపై పిచికారీ చేయాలి. దీనితో పాటు 2 శాతం రంద్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగాలి. దీని వల్ల అరటిపండ్ల పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తయారై నాణ్యమైన పండ్లను పొందవచ్చు. ఇవి ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.

News October 28, 2025

మంథని: మద్యం షాపులు దక్కించుకున్న LUCKY విజేతలు వీరే

image

మంథని పట్టణంలో 5 మద్యం షాపులను లక్కీ డ్రా ద్వారా సోమవారం ప్రకటించారు. మంథని పట్టణం షాప్ నంబర్ 1: ఇందారపు అనిల్, మల్హర్ రావు- మండలం తాడిచర్ల, షాప్ నంబర్ 2: పినగాని శ్రావణ్ కుమార్ గుంజపడుగు మంథని, షాప్ నంబర్ 3: రావికంటి వెంకటేష్ మల్లారం, మంథని, షాప్ నంబర్ 4: సముద్రాల పరుశురాం కన్నాల, పెద్దపల్లి, షాప్ నంబర్ 5: బుట్టి సాంబశివమూర్తి కన్నాల, పెద్దపల్లి, గుంజపడుగు సందెవేన భారతి దక్కించుకున్నారు.

News October 28, 2025

హరీశ్ రావు తండ్రి మృతి.. దూరంగా కవిత

image

TG: మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ ఇవాళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్వయానా KCR బావ. దీంతో మాజీ CM కుటుంబమంతా ఉదయం నుంచి హరీశ్ ఇంటి వద్దే ఉంది. అయితే తన మామ అంత్యక్రియలకు కవిత దూరంగా ఉన్నారు. ఇటీవల హరీశ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేయడమే అందుకు కారణం. రాజకీయ విభేదాలతో కుటుంబాల మధ్యా వైరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ టైమ్‌లో కవిత వెళ్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.