News October 28, 2025

పల్నాడు: ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారులకు మరో అవకాశం

image

పల్నాడు జిల్లాలో వివిధ కారణాల వల్ల 16,238 మంది పట్టాదార్ రైతులకు ఆధార్ సీడింగ్ కాలేదని అధికారులు గుర్తించారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఎంపికై, ఆధార్ కారణంగా నగదు పడని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ లబ్ధిదారులకు మీ సేవ కేంద్రాలలో ఆధార్ సీడింగ్‌కు సర్వీస్ ఛార్జి మినహాయింపు ఇస్తూ సీసీఎల్ఏ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News October 29, 2025

పాడేరు: ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలి

image

మట్టి గృహాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ రెండు గంటలకు నివేదికలు అందజేయాలన్నారు. తుఫాను ప్రభావంతో జిల్లాలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. చేపడుతున్న చర్యలు గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలన్నారు.

News October 29, 2025

ఫ్రీ బస్సు ఇస్తే.. టికెట్ రేట్లు పెంచుతారా: నెటిజన్

image

TGSRTCలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు శంషాబాద్ TO ఎల్బీ నగర్ టికెట్ రూ.30-35 ఉంటే ఇప్పుడు (బీటెక్ థర్డ్ ఇయర్) రూ.60 అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచిదే. కానీ రేట్లు ఎందుకు ఇంతలా పెంచుతున్నారు’ అని ప్రశ్నించాడు. BRS, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ RTC టికెట్ రేట్లను చాలా పెంచాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

News October 29, 2025

CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

image

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌‌తో ఏదో మాట్లాడారు.