News October 28, 2025
తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా: YCP

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కనిపించట్లేదని YCP ఆరోపిస్తోంది. ‘మంత్రి కందుల దుర్గేశ్ నియోజకవర్గంలోనే పునరావాస కేంద్రాలు కనిపించట్లేదు. కలెక్టర్ ఆదేశాలిచ్చినా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునే తీరు ఇదేనా? విజయనగరం జిల్లా గుర్లలో తుఫానుతో వరి పంట నేలకొరిగింది. రైతుల్ని పరామర్శించడం కాదు కదా.. కనీసం కూటమి నేతలు పట్టించుకోవట్లేదు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News October 29, 2025
మళ్లీ యుద్ధం.. గాజాపై భీకర దాడులకు ఆదేశం

ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. గాజాపై పవర్‌ఫుల్ స్ట్రైక్స్ చేపట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా మిలిటరీని ఆదేశించారు. హమాస్ పీస్ డీల్‌ను ఉల్లంఘించిందని, ఇజ్రాయెలీ బందీల మృతదేహాలు, అవశేషాలను ఇంకా అప్పగించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో తమ బలగాలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. దీంతో యుద్ధం మళ్లీ మొదలవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
News October 29, 2025
ఫ్రీ బస్సు ఇస్తే.. టికెట్ రేట్లు పెంచుతారా: నెటిజన్

TGSRTCలో టికెట్ రేట్లు విపరీతంగా పెరిగాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు శంషాబాద్ TO ఎల్బీ నగర్ టికెట్ రూ.30-35 ఉంటే ఇప్పుడు (బీటెక్ థర్డ్ ఇయర్) రూ.60 అయింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం మంచిదే. కానీ రేట్లు ఎందుకు ఇంతలా పెంచుతున్నారు’ అని ప్రశ్నించాడు. BRS, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలూ RTC టికెట్ రేట్లను చాలా పెంచాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
News October 29, 2025
$4 ట్రిలియన్ల క్లబ్.. యాపిల్ అరుదైన ఘనత

టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ $4 ట్రిలియన్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో కంపెనీగా నిలిచింది. ఇవాళ కంపెనీ షేర్లు 0.2% పెరిగి $267.87కు చేరాయి. SEPT 9న ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ లాంచ్ చేసినప్పటి నుంచి కంపెనీ స్టాక్ 13% పెరిగింది. చైనాలో కాంపిటీషన్, US టారిఫ్స్ ప్రతికూలతలను ఎదుర్కొని లాభాలు గడించింది. యాపిల్ కంటే ముందు Nvidia, మైక్రోసాఫ్ట్ $4T కంపెనీలుగా అవతరించాయి.


