News April 10, 2024

చార్మినార్‌ వద్ద ఇదీ పరిస్థితి!

image

రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో‌ పాషింగ్‌ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్‌ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటో‌లను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
PIC CRD: Anjum Alam

Similar News

News October 28, 2025

జూబ్లీ బైపోల్: ఇంటి వద్దే వారికి ఓటు హక్కు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నికల కమిషన్ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇందుకు ఓటర్లు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 102 మంది వృద్ధులు, దివ్యాంగులు దీనికోసం అప్లై చేసుకున్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఈసీ ఈ చర్యలు చేపట్టింది.

News October 28, 2025

HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

image

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.

News October 28, 2025

HYD: జూబ్లీ బరిలో 29 మంది స్వతంత్రులు

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీల నుంచి 26 మంది అభ్యర్థులు బరిలో దిగగా.. 29 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే అభ్యర్థులకు గుర్తులు కేటాయించగా.. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉన్నారు.