News October 28, 2025

లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

image

TG: మల్లోజుల, ఆశన్న బాటలోనే మావోయిస్టు కీలక నేత లొంగిపోయారు. 45 ఏళ్లు అజ్ఞాతంలో ఉన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ ఇవాళ DGP శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. మంచిర్యాల(D) మందమర్రికి చెందిన ఆయన సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ 1980లో పీపుల్స్‌ వార్‌ ఉద్యమాలకు ఆకర్షితుడయ్యారు. 1984లో AITUC నేత అబ్రహం హత్య కేసులో అరెస్టై ADB సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు.

Similar News

News October 29, 2025

తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం: CM

image

AP: తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని CM CBN అన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని, స్థానిక పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.

News October 29, 2025

రోహిత్‌కు తగిన గుర్తింపు దక్కలేదు: క్లార్క్

image

ఇండియాకు రివర్స్‌గా ఉండే ఆస్ట్రేలియన్ కండిషన్లలోనూ రోహిత్ శర్మ బాగా ఆడుతారని AUS మాజీ ప్లేయర్ మైఖేల్ క్లార్క్ ప్రశంసించారు. హిట్ మ్యాన్ ఆడే విధానం తనకు నచ్చుతుందని తెలిపారు. ‘వైట్ బాల్ కెప్టెన్‌గా రోహిత్‌కు తగిన గుర్తింపు దక్కలేదు. నేను కలిసి ఆడిన బెస్ట్ వైట్ బాల్ ప్లేయర్లలో అతను ఒకడు. కోహ్లీ అద్భుతమైన వన్డే క్రికెటర్. ప్రస్తుత ఫామ్ కొనసాగితే 2027 WCలోనూ వీరు ఆడే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

News October 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.