News October 28, 2025

గద్వాల: భారీ వర్షాలు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి.ఎం.సంతోష్ అధికారులను ఆదేశించారు. ఆరబెట్టిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

Similar News

News October 29, 2025

మామిడిలో చెదను ఎలా నివారించాలి?

image

మామిడిలో OCT నుంచి డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్‌ని పూతగా పూయాలి.

News October 29, 2025

ముల్లోకాల్లో ఉన్న పుణ్య తీర్థాలు కలుస్తాయి

image

కార్తీక మాసంలోని పర్వదినాల్లో ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు కపిలతీర్థం పుష్కరిణికి చేరుతాయని ప్రతీతి. కార్తీక పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, సోమవారం, శనివారాల్లో మధ్యాహ్న సమయంలో వివిధ పుణ్యతీర్థాలు కలుస్తాయని అర్చకులు తెలిపారు. ఈ సమయంలో స్నానాలు చేయడం వల్ల సమస్త పాపవిముక్తి జరుగుతుందని భక్తుల విశ్వాసం.

News October 29, 2025

HYD: భారీగా బకాయిలు.. నల్లా కనెక్షన్ కట్!

image

HYD జలమండలికి దాదాపు రూ.1,300 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నగరవాసుల నల్లా ఛార్జీలే రూ.147కోట్లు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నల్లా బిల్లును పూర్తిగా వసూలు చేసేందుకు నగరంలో చర్యలు షురూ అయ్యాయి. బకాయి ఉన్న వినియోగదారులకు ముందుగా నోటీసులు జారీ చేస్తారు. గడువు ముగిసినా చెల్లించకపోతే వారికి నీటి సరఫరా నిలిపివేసి, వసూలుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.