News April 10, 2024

సూర్యాపేట: వ్యవసాయ మార్కెట్‌కు రెండురోజులు సెలవు

image

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11, 12న రెండురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి రాహుల్ మంగళవారం తెలిపారు. ఈనెల 11న గురువారం రంజాన్, 12న శుక్రవారం సెలవు ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 13న మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News April 2, 2026

NLG: 15 దిగ్గజ కంపెనీలతో మెగా జాబ్‌మేళా

image

MGU, టాస్క్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాలో 15 కంపెనీలు పాల్గొననున్నట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ హరీష్ కుమార్ తెలిపారు. ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ రంగాలలో సుమారు 1500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లమో, ఇంజనీరింగ్ బీఎస్సీ అగ్రికల్చర్, B.Com,బీఫార్మ, MBA, MCA, M.Sc, డిగ్రీ చివరి సంవత్సరం అభ్యర్థులు హాజరు కావాలన్నారు.

News April 2, 2026

బ్యాంక్ వివరాలు పంచుకోవద్దు: నల్గొండ ఎస్పీ

image

నార్కట్‌పల్లిలో ఇవాళ గ్రామసభలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ‘అలైవ్ అండ్ అరైవ్’ ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సభలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

News April 2, 2026

నల్గొండ: సదరం శిబిరాల షెడ్యూల్‌ ఖరారు

image

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ నెల ‘సదరం’ శిబిరాల గడువును అధికారులు ప్రకటించారు. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీ కోసం విభాగాల వారీగా తేదీలు కేటాయించారు. శారీరక వైకల్యానికి ఈ నెల 7, 16, 21, 23.. మానసిక స్థితికి 8, 22.. దృష్టి లోపానికి 9, 28.. శ్రవణ లోపానికి 6, 13, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులు మీ-సేవ లేదా UDID పోర్టల్‌లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.