News April 10, 2024
ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

అనంతపురం నగరంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని STPO కార్యాలయంలో నగర పోలీస్ అధికారులతో సమావేశమై, ఎన్నికల వేళ తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. నగరం, పోలీస్ స్టేషన్ల పరిధిలో, భౌగోళిక స్థితిగతులు, పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News March 21, 2026
అనంతపురంలో బీజేపీ ‘SIR’ జిల్లా సన్నాహక సమావేశం

అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్ కురుబ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర మీడియా ప్రతినిధి మధుసూదన్, కార్యదర్శి శ్రీనివాసులు, చిరంజీవి రెడ్డి హజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీదేవి పాల్గొన్నారు.
News March 21, 2026
అనంత: ఈతకు వెళ్లి బాలుడి మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోటలో బావిలో ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్(13) స్నేహితులతో కలిసి ఈత కొడుతుండగా పూడికలో ఇరుక్కొని నీటిలో మునిగిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొనగా, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.