News October 28, 2025
అందరూ ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు

మొంథా తుపాను నేపథ్యంలో కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
Similar News
News October 29, 2025
ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్: కలెక్టర్

తుఫాను కారణంగా ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. తుఫాను సహాయక చర్యలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాత్రి సమయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగులు, వంకలు ఎవరు దాటకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
News October 28, 2025
ANU: దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జులై, ఆగస్టులో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు మంగళవారం విడుదల చేశారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ, మ్యాథమెటిక్స్, ఎంసీఏ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్, ఫలితాలు తదితర వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుండి పొందువచ్చని చెప్పారు.
News October 28, 2025
GNT: జిల్లా ప్రజలకు ముఖ్య సూచన.. అత్యవసరమైతేనే

మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు ప్రయాణాలపై పరిమితులు విధిస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు జారీ చేసింది. రాత్రి 7 గంటల తర్వాత జాతీయ రహదారులపై భారీ వాహనాలు నడపకూడదని, ముందుగానే సురక్షిత లే బే ప్రాంతాల్లో నిలిపి వేయాలని తెలిపింది. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ సూచనలు తప్పక పాటించాలని విజ్ఞప్తి చేసింది.


