News October 28, 2025
PDPL: NOV 2 నుంచి గోదావరి మహా హారతి

కార్తీక మాసంలో నిర్వహించే గోదావరి మహా హారతి కార్యక్రమం NOV 2న మంథని నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6న అంతర్గాంలో, 9న ధర్మపురిలో, 12న గోదావరిఖనిలో నిర్వహించే గోదావరి మహా హారతి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. BJP జాతీయ నాయకులు మురళీధర్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
KNR: AIతో మార్ఫింగ్.. బాలికలపై లైంగిక వేధింపులు..!

గంగాధర మం. కురిక్యాల ZPHSలో బాలికలతో అటెండర్ దిగిన ఫొటోలను అతడు AIతో మార్ఫింగ్ చేసి విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ నిందితుడిని <<18125828>>సస్పెండ్<<>> కాకుండా మొత్తం సర్వీస్ నుంచి తొలగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై POCSO ACTలోని సెక్షన్ 21 కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని CP తెలిపారు.
News October 29, 2025
బ్రెయిన్ స్ట్రోక్.. సత్వర వైద్యమే కీలకం

హైబీపీ, డయాబెటిస్, ఊబకాయం, ఒత్తిడి వల్ల మహిళల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ‘మొత్తం బాధితుల్లో 30-45 ఏళ్ల వయసున్న వారు 15% వరకు ఉంటున్నారు. సకాలంలో చికిత్స చేయిస్తేనే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. ఒక్కసారిగా మైకం, చూపుపోవడం, ముఖం ఒకవైపు జారిపోవడం, అవయవాల బలహీనం, మాట అస్పష్టత దీని లక్షణాలు’ అని పేర్కొన్నారు.
News October 29, 2025
బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణ, చికిత్స ఇలా

మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యంతో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. CT స్కాన్, MRI, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, కరోటిడ్ అల్ట్రాసౌండ్, సెరెబ్రల్ యాంజియోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా స్ట్రోక్‌ను నిర్ధారిస్తారన్నారు. ఫిజియోథెరపీతో పాటు, యాంటీ ప్లేట్‌లెట్లు, యాంటీ కాగ్యులెంట్లు, స్టాటిన్లు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని పేర్కొన్నారు.


