News October 28, 2025

మునగ సాగు.. ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం

image

మునగ సాగుతో అధిక ఆదాయం పొందుతున్నారు కర్ణాటకకు చెందిన ఉమేశ్‌రావు. 2010 నుంచి 10 ఎకరాల భూమిలో సహజ ఎరువులు వాడుతూ మునగసాగు చేస్తున్నారు. మార్కెట్‌లో మునగాకులపొడికి ఉన్న డిమాండ్ చూసి దాన్నే తయారు చేసి వివిధ కంపెనీలకు విక్రయిస్తున్నారు. ఏటా ఎకరాకు రూ.4 లక్షల చొప్పున 10 ఎకరాల నుంచి రూ.40 లక్షల ఆదాయం పొందుతున్నారు.✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

Similar News

News October 29, 2025

ఈ జిల్లాల్లో యథావిధిగా స్కూళ్లు

image

AP: మొంథా తుఫాను బలహీనపడింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిన్నటి వరకు సెలవులు కొనసాగిన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు అధికారులు వెల్లడించారు. అటు తిరుపతి జిల్లాకు తొలుత ఇవాళ కూడా హాలిడే ప్రకటించినా.. తుఫాను ప్రభావం లేకపోవడంతో సెలవు రద్దు చేశారు. స్కూళ్లు కొనసాగుతాయని, విద్యార్థులు రావాలని సూచించారు.

News October 29, 2025

బ్రెయిన్ స్ట్రోక్.. సత్వర వైద్యమే కీలకం

image

హైబీపీ, డయాబెటిస్, ఊబకాయం, ఒత్తిడి వల్ల మహిళల్లోనూ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ‘మొత్తం బాధితుల్లో 30-45 ఏళ్ల వయసున్న వారు 15% వరకు ఉంటున్నారు. సకాలంలో చికిత్స చేయిస్తేనే ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు. ఒక్కసారిగా మైకం, చూపుపోవడం, ముఖం ఒకవైపు జారిపోవడం, అవయవాల బలహీనం, మాట అస్పష్టత దీని లక్షణాలు’ అని పేర్కొన్నారు.

News October 29, 2025

బ్రెయిన్ స్ట్రోక్ నిర్ధారణ, చికిత్స ఇలా

image

మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యంతో బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుందని న్యూరాలజిస్ట్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. CT స్కాన్, MRI, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్, కరోటిడ్ అల్ట్రాసౌండ్, సెరెబ్రల్ యాంజియోగ్రామ్ వంటి టెస్టుల ద్వారా స్ట్రోక్‌ను నిర్ధారిస్తారన్నారు. ఫిజియోథెరపీతో పాటు, యాంటీ ప్లేట్‌లెట్లు, యాంటీ కాగ్యులెంట్లు, స్టాటిన్లు తీసుకోవడం ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించవచ్చని పేర్కొన్నారు.