News October 28, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: మహిళలు.. కేవలం 7 శాతమేనా!

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను రాజ్యాంగం కల్పించింది. అయితే వివిధ రాజకీయ పార్టీలు మహిళలకు పోటీచేసే అవకాశం ఇవ్వడం లేదు. ఇపుడు జూబ్లీహిల్స్ బైపోల్‌లోనూ అదే పరిస్థితి. కేవలం 7% మంది మాత్రమే పోటీచేస్తున్నారు. మొత్తం 58 మంది ఈ ఎన్నికల్లో బరిలో ఉండగా కేవలం నలుగురే పోటీలో ఉన్నారు. దీంతో.. ఇదేనా మహిళలకు దక్కే సమానత్వం అని పలువురు వాపోతున్నారు.
Similar News
News October 29, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. HYDలో సెలవుకు డిమాండ్

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో HYDతో సహా ఉమ్మడి RRలో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నగరంమంతా మబ్బు కమ్మేసి ఇంకా చీకటిగా ఉంది. కాగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని నగరవాసుల నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇంటి నుంచి విద్యాలయాలకు తడుస్తూనే వెళ్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో సెలవులు ప్రకటించగా HYDలో ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్.
News October 29, 2025
HYD: అలెర్ట్ మరికాసేపట్లో వర్షం

హైదరాబాద్‌లో రానున్న 1-2 గంటల్లో తేలికపాటి వర్షం (<5 MM) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులు గంటకు 40 KM వరకు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొంది. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగర వాసులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 29, 2025
HYD: భారీగా బకాయిలు.. నల్లా కనెక్షన్ కట్!

HYD జలమండలికి దాదాపు రూ.1,300 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నగరవాసుల నల్లా ఛార్జీలే రూ.147కోట్లు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నల్లా బిల్లును పూర్తిగా వసూలు చేసేందుకు నగరంలో చర్యలు షురూ అయ్యాయి. బకాయి ఉన్న వినియోగదారులకు ముందుగా నోటీసులు జారీ చేస్తారు. గడువు ముగిసినా చెల్లించకపోతే వారికి నీటి సరఫరా నిలిపివేసి, వసూలుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.


