News October 28, 2025

కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

image

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News October 29, 2025

TG: మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వానలు పడతాయంటూ IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పిల్లల్ని బయటికి పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు.

News October 29, 2025

BELలో 340 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, BSc(Eng) ఫస్ట్ క్లాస్‌లో పాసైనవారు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.1180, SC/ST/ PwBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News October 29, 2025

జీవిత సత్యం.. తెలుసుకో మిత్రమా!

image

జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి, జైలు, శ్మశానాన్ని సందర్శించాలని స్పిరిచ్యువల్, లైఫ్ కోచెస్ సూచిస్తున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యం విలువ, జైలులో ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుస్తుంది. శ్మశానంలో ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే నేలలో కలిసిపోతారు. చివరికి మనం మిగిల్చిపోయే జ్ఞాపకాలు, మనతో తీసుకెళ్లే పశ్చాత్తాపాలే ముఖ్యమని ఈ మూడు వివరిస్తాయని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్.