News April 10, 2024
విశాఖ నుంచి బ్యాంకాక్ డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం

విశాఖపట్నం విదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఏషియా సంస్థ తీపి కబురు అందించింది. మంగళవారం బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సదుపాయాన్ని కల్పించింది. ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 కి బయల్దేరి విశాఖకు 11.20 కి ఫ్లైట్ చేరుకుంటుంది. తిరిగి రాత్రి 11.50 కి విశాఖ నుంచి ఎయిర్ ఏషియా ఫ్లైట్ బయలుదేరి వెళ్తుంది. ఈ నేపథ్యంలో తొలి సర్వీస్ ప్రయాణికులకు పుష్ప గుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికారు.
Similar News
News March 3, 2026
విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

ఆర్కేబీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News March 3, 2026
విశాఖ: బర్త్‌డే.. డెత్ డే

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు <<19282896>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ధర్మేందర్ తెలిపారు.
News March 3, 2026
విశాఖ: కోస్టల్ కారిడార్‌పై మల్లగుల్లాలు..

భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు VMRDA ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష జరిగింది. ఎయిర్‌పోర్ట్ అనుసంధాన మార్గాలు, విశాఖ పోర్టు నుంచి విమానాశ్రయం వరకు కొస్టల్ కారిడార్ ప్రతిపాదనపై MPలు, MLAలు, విశాఖ, విజయనగరం కలెక్టర్లు చర్చించారు. అమలుపై ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు, సూచనలు చేశారు. భూసేకరణ, మార్గ రూపకల్పన అంశాల్లో స్పష్టత అవసరమని అభిప్రాయపడినట్టు తెలిసింది.


