News October 28, 2025

NGKL: హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని స్ఫూర్తి(21) ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మంగళవారం కలకలం రేపింది. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుమందు తాగినట్లు గమనించిన తోటి విద్యార్థినీలు నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 29, 2025

అర్థరాత్రి ఆర్టీజీఎస్‌లో మంత్రి లోకేశ్ సమీక్ష

image

తుపాను తీవ్రతపై మంత్రి లోకేశ్ అర్థరాత్రి 12 గంటలకు ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి అనిత, మంత్రి నారాయణ పాల్గొన్నారు. తుపాన్ తీరం దాటే సమయం కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ ఆదేశించారు. ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఆయన ఈ రాత్రికి ఆర్టీజీఎస్ కేంద్రంలోనే బస చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

News October 29, 2025

సంగారెడ్డి: ‘శిథిలావస్థ తరగతి గదుల్లో బోధన వద్దు’

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని హెచ్ఎంలు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

News October 29, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జ్) ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) వాగు మల్లారానికి చెందిన మైనర్ బాలికపై జానంపేటకు చెందిన గాడిద శ్రీనివాస్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించగా శ్రీనివాస్‌పై నేరం రుజువైంది. దాంతో శిక్ష పడింది.