News April 10, 2024
శ్రీకాకుళం: జీడిపంటకు భారీ నష్టం

జిల్లా వ్యాప్తంగా 46,743.63 ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. అందులో ఒక్క పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోనే సుమారు 24,753 ఎకరాల్లో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల టన్నుల జీడి పిక్కలు దిగుబడి వస్తుండగా, సుమారు 13వేల మందికి ఈ పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కొన్ని తెగుళ్ల వల్ల పంటకు భారీ నష్టం వాటిల్లింది.
Similar News
News March 9, 2026
శ్రీకాకుళం: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి

శ్రీకాకుళం నగరం జడ్పీ ఎదురుగా APHB కాలనీకి చెందిన డబ్బీరు నిఖిత ఇటీవల మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. శ్రీకాకుళం రూరల్ నైర వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బిఎస్సీ, భువనేశ్వర్లో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఐబీపీఎస్ పరీక్ష ద్వారా క్లర్క్ పీవో ఉద్యోగాలకు, అలాగే ఎస్బీఐలో క్లర్క్ పోస్టుకు ఎంపికైంది. రెండు ఉద్యోగాలు ఇంటర్వ్యూ దశలో ఉన్నాయి.
News March 9, 2026
మగపిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి: శ్రీకాకుళం ఎస్పీ

జిల్లా పోలీసు శాఖ మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లలకు జాగ్రత్తలు చెప్పడం కంటే, మగపిల్లలు తప్పు చేయకుండా పెంచడంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 8, 2026
SKLM: మహిళా సంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్

జిల్లాలో మహిళాసంఘాలకు రూ.2,266 కోట్లు క్రెడిట్ లింకేజీ అందించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా సాధికారత పథకాల అమల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు.


