News October 28, 2025
మొంథా తుఫాన్.. వాహనదారులకు బిగ్ అలర్ట్

AP: మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో భారీ వాహనదారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాహనదారులు ముందే సురక్షిత ‘లేబే’ల్లో వాటిని పార్క్ చేసుకోవాలని సూచించింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని మరోసారి హెచ్చరించింది.
Similar News
News October 29, 2025
సిద్దిపేట: ‘దరఖాస్తు తేదీ పొడిగింపు’

2025-2026 విద్యా సంవత్సరానికి మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించినట్లు సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అహ్మద్ తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కళాశాలలు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 31 వరకు గడువు పొడగించామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.
News October 29, 2025
సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనున్న రజినీ?

రజినీకాంత్, కమల్ హాసన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 2027లో షూటింగ్ ప్రారంభవుతుందని, రజినీకి ఇదే చివరి సినిమా అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు తర్వాత రిటైర్ కావాలని ఆయన డిసైడయ్యారట. కాగా ఆయన ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్-2’ చేస్తున్నారు. ఆ తర్వాత సి.సుందర్‌తో ఓ మూవీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. రజినీ-కమల్ మూవీని నెల్సన్ తెరకెక్కిస్తారని సమాచారం.
News October 29, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

TG: గద్వాల్, MBNR, NGKL, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HNK, HYD, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, WGL జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మీ ప్రాంతంలో వాన పడుతోందా?


