News October 28, 2025

అనధికార లే ఔట్లకు మరో 3 నెలలు గడువు: కలెక్టర్

image

జిల్లాలో అనధికార లేఅవుట్లు, ఫ్లాట్ క్రమబద్దీకరణకు మరో 3 నెలలు ప్రభుత్వం గడువు పొడిగించిందని మంగళవారం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. 2026 జనవరి 23లోగా దరఖాస్తులు సమర్పించి క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. ప్రణాళిక బద్ధమైన లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Similar News

News October 29, 2025

KNRలో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

image

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సెలవు ప్రకటిస్తూ విద్యాధికారులకు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందుబాటులో ఉండాలని సూచించారు.

News October 29, 2025

ఏసీబీకి చిక్కిన యాదాద్రి దేవాలయ అధికారి

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్‌లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

News October 29, 2025

రేపు యథావిధిగా పాఠశాలలు: నంద్యాల డీఈవో

image

నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు రేపటి నుంచి యథావిధిగా పనిచేయాలని డీఈవో జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే గురువారం సెలవు ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.