News October 28, 2025
పల్నాడు: రేపు విద్యా సంస్థలకు సెలవు

తుఫాను కారణంగా పల్నాడు జిల్లాలో 29వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కలెక్టర్ కృతికా శుక్లా కీలక ప్రకటన చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Similar News
News October 29, 2025
MHBD: ‘అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి’

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను (7995074803) ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అత్యవసరమైన పరిస్థితి ఏర్పడినా ఈ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నందు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
News October 29, 2025
తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించింది.
News October 29, 2025
రైతులు నష్టపోకూడదు.. జనగామ కలెక్టర్ ఆదేశం

జనగామ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తుఫాను ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్, రెవెన్యూ శాఖల అధికారులతో బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


