News October 28, 2025
MHBD: ముంచుకొస్తున్న తుపాన్.. రైతన్నకు పరేషాన్..!

వాతావరణ శాఖ ప్రకటించిన మోంథా తుపాన్ ప్రభావం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో జిల్లాలోని వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇటీవల వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే తుపాన్‌ను తలుచుకొని వరి, పత్తి, మిరప సాగు చేస్తున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. వర్షాలతో నష్టపోతున్నామని కన్నీరు పెడుతున్నారు.
Similar News
News October 29, 2025
మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది ఇందుకే!

తాను పనిచేస్తుంటే హెల్ప్ చేయకుండా ఫోన్ చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్న భర్తను చూసి మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఉద్యోగం కంటే కూడా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందని తేలింది. ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణతో మహిళల్లో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. ఇది సోమరితనం కాదని, బాధ్యతల్లో అసమతుల్యత అని నిపుణులు చెబుతున్నారు. *ఇంట్లో భార్యకు హెల్ప్ చేయండి బాస్
News October 29, 2025
WGL: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త రకాల మోసాలకు తెరలేపుతున్నారు. ఇటీవల వారు పోలీస్ లేదా సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటూ ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్ కాల్స్ వస్తే భయపడకుండా, ఎటువంటి వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తక్షణమే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు.
News October 29, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 110 అప్రెంటిస్‌లు

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<


