News October 28, 2025
HYD మెట్రో కోసం మూతబడ్డ మున్షీనాన్

మున్షీనాన్.. పాతబస్తీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. 174 ఏళ్లుగా నడిచిన నాన్ షాపును HYD మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఇటీవల తొలగించారు. నిజాం వద్ద క్లర్క్‌గా పనిచేసే మున్షీ ఢిల్లీ వీధుల్లో నిప్పుల కొలిమితో చేసిన చతురస్త్ర ఆకారపు రొట్టెకు ఫిదా అయ్యారు. అచ్చం అలానే చార్మినార్‌లో 1851లో మున్షీనాన్ ఏర్పాటు చేశారు. జనాదరణతో మున్షీనాన్ నగరవ్యాప్తమైంది. 2025 మెట్రో పనుల్లో భాగంగా ఈ దుకాణం కనుమరుగైంది.
Similar News
News October 29, 2025
NRPT: బస్సు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

నారాయణపేట పట్టణానికి చెందిన అంజమ్మ, ఆదివారం పెబ్బేరు బస్టాండ్‌లో బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి రెండు కాళ్లు తొలగించినా, శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 29, 2025
నారాయణపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షం

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఆగస్టు నుంచి వరుసగా కురుస్తున్న అధిక వర్షాలు రైతుల ఆశలను నీరుగారుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో మంగళవారం అత్యధికంగా కొత్తపల్లి మండల పరిధిలో 24.8 మి.మీ వర్షపాతం నమోదైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ అధిక వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News October 29, 2025
సంగారెడ్డి జిల్లా ఏఓగా సత్యనారాయణ నియామకం

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త కార్యాలయ నూతన ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా డాక్టర్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తూ తాజాగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ ఏఓగా పనిచేసిన డాక్టర్ భాగ్యశేఖర్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు.


